Message Of State President

ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఏర్పడి ది. 28-08-1992 Redg.No. 2923/92తో రిజిస్టేషన్ ఆఫ్ సొసైటీస్ ప్రకారం హైదరాబాద్ నందు రిజిస్ట్రేషన్ చేయబడింది.  గౌడ ఉపకులాలైన గౌడ, ఈడిగ, శెట్టిబలిజ, శ్రీ శయన మరియు యాత ఉద్యోగులతో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం –గేవా (GEWA)గా ప్రాచుర్యం పొంది ఈ 2022 సంవత్సరానికి 30 వసంతాలు పూర్తిచేసుకున్నది.  ఈ విధమైన ఉపకులాలతో నడుస్తున్న ఏకైక ఉద్యోగ సంఘం ఏదైనా ఉన్నది అంటే అది మన గేవా (GEWA) అనడంలో సందేహం ఏమాత్రం లేదు.

మన సంఘీయులకు చేదోడు వాదోడు గా ఉంటూ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుకోవాలనే సదుద్దేశ్యంతో ఈ సంఘాన్ని తీర్చిదిద్దిన విషయాన్ని మన సంఘ వ్యవస్తాపకులు శ్రీ బొల్లా శివయ్య గౌడ్, శ్రీ వీరంకి నాగేశ్వరరావు, శ్రీ జోగి నాగేశ్వరరావు గార్లు అనేక సమావేశాలలో తెలియజేశారు. 

2019వ సంవత్సరంలో 27 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా అందరి ఆమోదంతో నియమించడం జరిగింది.  ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రంలో జరుపుకునే గేవా వార్షికోత్సవాలు 28, 29 కరోనా కారణంగా zoom meeting ద్వారా మాత్రమే నిర్వహించడం జరిగింది.  2022 సంవస్తారంలో జరుగవలసిన 30వ వార్షికోత్సవం తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించారు.  ఈ సమావేశం నాటికి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కమిటీలను 26 జిల్లాలకు విస్తరింపచేయాలని సంకల్పించి పాతజిల్లాల కమిటీలను రద్దుచేసి అన్నీ జిల్లాలకు నూతన కమిటీలు నియమించడం కొరకు ఆడ్-హాక్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 

తిరుపతిలో 30వ వార్షికోత్సవం  నాటికి మొత్తం 18 జిల్లాలకు గాను కమిటీలు పూర్తిస్తాయిలో నియమించడం జరిగిందని తెలియజేయడానికి సంతసిస్తున్నాను.  ఇందుకు గాను సహకరించిన ఆడ్-హాక్ కమిటీ సభ్యులకు, మన విశ్రాంత ఉద్యోగులకు, సంఘీయులకు నా నమస్కారాలు.  నూతన కమిటీ మెంబర్స్ కి నా అభినందనలు ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాను.  జిల్లాలవారిగా కమిటీలవివరాలు మరియు వారిఫోటోలతో 30వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు సహకరించిన అందరికీ ముఖ్యంగా ఈ ప్రత్యక పుస్తక కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. 

GEWAలో అన్నీ స్థాయిల ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఉన్నవారితోపాటు మన ఉన్నతాధికారులను కూడా భాగస్వామ్యం చేసిన రోజున మన సంఘీయులజు విద్య, వైద్యం, వివాహాలు, ఆర్ధిక సహాయం,అభివృద్ది వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించేదానికి దోహదపడినవారమౌతాము. 

ధన్యవాదములతో

 

మీ
రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్ర ప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం

 

 

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com