Gowda mahaneeyulu

సర్దార్ గౌతు లచ్చన్న

డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 1909 సంవత్సరం ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకా "బారువ" అనే సముద్రపు ఒడ్డున ఉండి మేజరు పంచాయతీగా ఎదిగిన గ్రామంలో శ్రీ చిట్టియ్య, రాజమ్మ దంపతులకు అష్టమ సంతానంగా జన్మించారు.  కులవృత్తి నుండి మార్చాలనే తలంపుతో తల్లిదండ్రులు వీరిని చదివించాలని నిశ్చయం చేసుకున్నారు. 

బారువ లో ఒక ప్రాథమిక పాఠశాలలో చేర్చి, ఆ ఉపాధ్యాయుని ఇంట్లో ట్యూషన్, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడంతో, పగలు మధ్యాహ్న భోజనానికితప్ప  మిగతా సమయమంతా ఉపాధ్యాయుని ఇంటనే గడిచిపోయేది.   లచ్చన్నకు 13వ ఏట ఎంకా ఎనిమిదవ తరగతైనా నిండకుండానే తల్లిదండ్రుల అభీష్టము మేరకు వివాహం జరిగింది.  1930 వ సంవత్సరంలో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలకు హాజరై అటుపిమ్మట జాతీయ నాయకుల పిలుపునందుకుని, స్వరాజ్య సమరంలో పాల్గొని, చదువుకు స్వస్తి పలికారు.  "నౌపడ" ఉప్పు సత్యాగ్రహం శిబిరంలో పాల్గొన్నారు.  ఇతర సత్యాగ్రహులతోపాటు నిర్భంధించబడి, విచారణానంతరం 2 మాసముల 15 రోజుల కఠిన కారాగార వస శిక్షతో ప్రారంభమైనది వారి జైలు జీవితగాధ.  1932 సంవత్సరంలో బాపూజీ పిలుపునందుకుని శ్రీకాకుళం జిల్లాలో సహాయనిరాకరణ ఉద్యమం చేపట్టారు.  లాఠీచార్జీలకు గురయ్యారు.  అరెస్టు కాబడ్డారు.  6 మాసములు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. జైలు నుండి విడుదల అనంతరం శ్రీ భగత్ సింగ్ విప్లవ బృందాన్ని వెదుకుతూ ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రమండలి అనేక ప్రాంతాలకు వెళ్లారు.  

1940 సంవత్సరంలో గాంధీజీ "సహాయ నిరాకరణోద్యమం " పిలుపునిచ్చారు.  ఈ ఉద్యమాన్ని శ్రీ లచ్చన్న ముందుగా తమ స్వగ్రామమైన బారువలో అమలు జరిపారు.  శ్రీ లచ్చన్న గారిపై కనిపిస్తే కాల్చివేత కు ఉత్తర్వులు జారీ చేశారు.  అందువలన అజ్ఞాతవాసంలో ఉండి కార్య కలాపాలను చృకుగా సాగించారు.  

1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో తన సహచరులతో కూడా పాల్గొని బ్రిటీషు పాలకుల గుండెలు  దడదడ లాడించారు.  మరలా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు - అజ్ఞాతవాసం. 1943  ఫిభ్రవరి  రాజమండ్రి లో నిర్భంధించబడి సంవత్సరం కఠిన కారాగారవాస శిక్షను అనుభవించారు . మరల 1944లో డిటెన్యూ చట్టము క్రింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.  1946లో కాననూర్ జైలు నుండి తంజావూరు జైలుకు తరలించబడ్డారు.  1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత శ్రీ ప్రకాశం పంతులు గారితో కారాగారవాస శిక్షనుండి విడుదలై స్వత్రంత్ర్య వాయువులను పీల్చారు. 

1948 సంవత్సరంలో విశాఖపట్టణం నియోజకవర్గం నుండి మద్రాసు రాష్ట్ర శాశనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.  1952 సం:: లో జరిగిన తొలి జనరల్ ఎన్నికలలో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్ధిగా సోంపేట నియోజకవర్గము నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించారు.  1953 సం:: లో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి నాయకత్వములో ఏర్పడిన మంత్రివర్గములో వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రివర్యులుగా పనిచేశారు.  రాజధాని నిర్ణయం విషయంలో భేధాభిప్రాయములు వచ్చి మంత్రి పదవిని విసర్జించారు.  సర్దార్ లచ్చన్న 1954 సం::లో కాంగ్రెస్స్ ప్రభుత్వము మద్యపానం నిషేధం అమలు జరిపింది. "కల్లుగీత సత్యాగ్రహ" ఉద్యమానికి రథసారథియై ప్రజలను ప్రభావితులను చేశారు.  లచ్చన్నగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నిరాటంకంగా  నెగ్గింది.  రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలింది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో మద్యపాన నిషేధం రద్దుచేయబడింది. గౌతు లచ్చన్నగారు గౌడజాతి విశ్యంలోనేగాక, ప్రజలలో ఏ ఒక్క బడుగు వర్గానికి అన్యాయం జరిగినా సహించలేదు.  అనేక పోరాటాలు నిర్వహించారు. ఘనవిజయాలు సాధించారు.  ఆయన వాగ్ధాటి , వాక్చాతురత, విమర్శనాగళం సర్వవేళలా ప్రజావీనులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. " సమాజపరంగా ఎవరి  బ్రతుకులు వారు బ్రతకడమే కాదు! ఎదుటివారి బ్రతుకులను కూడా పండించాలి!! అంటారు  సర్దార్.   1967 వ సం::లో స్వతంత్ర్య  పార్టీ అభ్యర్ధిగా శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికై లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వారి గురువు గారైన రాన్గాగారిని ఆ స్థానంలో గెలిపించారు.  

ది. 14-04-2006న తీవ్ర అనారోగ్యంతో  ఆస్పత్రిలో చెరీ ది. 19-04-2006న  తుదిశ్వాస విడిచారు.  "సహస్ర చంద్ర దర్శనోత్సవం " జరుపుకున్న మన "పెద్ద గౌడు " ఒక దీపశిఖ లాంటివారు.  పరులకోసం బ్రతికిన త్యాగజీవి.  బడుగు జీవుల చీకటి బ్రతుకుల్లో వెలుగుజూపి వారినుద్ధరించుటకు కంకణము కట్టుకున్న సమర సేనాని సర్ధార్ గౌతు లచ్చన్న గారు

(సేకరణ : గౌడప్రభ) 


 


సర్వాయి పాపన్న

*దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసిన.. "సర్వాయి పాపన్న" *✍
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
★సర్వాయి పాపన్న నేటి వరంగల్ జిల్లా, జనగాం మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు.తండ్రి చిన్నతనంలోనే చనిపో యారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవాడు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించే వాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.

*■ బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘీక,ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు, తల్లి సర్వమ్మకు ఒక్కకొడుకు కావడంతో గారాబంగా పెంచింది.పాపన్న వంశం శైవమతస్ధులై (శివభక్తులు) నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయా జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. కల్లుతా గడం, మాంసం తినడం అలవాటు చేసు కున్నాడు.*

*♻స్నేహీతులు..*
■ ఇతర కులాల వారితో తిరగడం వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రదాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్లు ఎక్కి (కలాలి) కల్లుగీయడం కులం పని చేయడం స్నేహీతులు, పాపయ్య కల్లుతాగడం లోకం తీరు చుట్టుప్రక్కల జరుగుచున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లడుకు నేవారు.

*☄హైదారాబాదు నైజాం ఆగడాలు..*

*■ నైజాం సైనికులు భూమి పన్నుల వసూలు విధానంలో ప్రజలను చాలా హింసాత్మకంగా, ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకల పేర్లతో శిస్తూలు వసూలు చేసేవారు.*

*■కులాల, మతలా పేర్లతో శిస్తూలు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులంవారికి "తాటిచెట్లకు పన్ను” వేసారు. నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని వెళ్లేదారిలో పాపన్న కల్లు అమ్ముకొనే మండువాలో నైజాం సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండ అడిగినా ఇవ్వకుండా హేలనగా నవ్వు కుంటు వెళ్లారు. కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండ వెల్లడం అలా రెండు, మూడు సార్లు అలాగే జరిగింది.*

*☄మొదటి తిరుగుబాటు..*

*■నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని కల్లు తాగి డబ్బులు ఇవ్వకున్న పాపన్న పెద్దగా పట్టించుకునేవాడు కాదు కానీ ఒకరోజు నైజాం సైనికుల్లో ఒకడు పాపన్న స్నేహితున్ని తన్నుటకు కాలుఎత్తాడు. అదిచూసిన ఒక సెకండులో కోపోద్రిక్కుత్తుడైన పాపన్న తన కాలుఎత్తిన సైనికుని మెడ నరికాడు, దాంతో మిగాతా సైనికులు పాపన్న మీదికి యుద్దనికి రావడం ఏంతో బలవంతు డైన పాపన్న వారిని కూడా అంతమొంది చాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికుల గుర్రాలు, వారు వసూలు చేసుకొని ధనరాసు లు.. పేదవారిని పీడీంచి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటు పాపన్న స్నేహితులతో గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. అప్పటి నుండి నైజాం సైనికు లు శిస్తూలు వసూలు చేసుకొని వేల్లేదారిల్లో పాపన్న, అతని స్నేహీతులతో కలసి తిరుగుబాట్లు ప్రారంబించారు.అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమక్చూకున్నాడు. యుద్దవిద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ఏరియాలో మారుమొగింది గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైని కులుగా 3000మందిని సమక్చూకున్నాడు.*

*☄భువనగిరి కోటపై తిరుగుబాటు🏜*

*■తెలంగాణాలో నైజాంరాజు యొక్క అప్పటి పాలకుల, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతంచెయ్యాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.*

*■పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింలపాలనా అంతానికిమహారాష్ట్ర లో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడారు. 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతి రేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండ లను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.*

*■ ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలె త్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీన పర్చారు.అయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయిస్తూ,చివరకు'గోల్కొండ కోట'ను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. భువన గిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.*

*★ పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యం తో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయంపాటించే వాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికి రూపం మారిన అలానే ఉంది.*

■పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు.సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహి తున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

*●ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు.1708లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడదీశారు.*

ఆవిధంగా ఓ వీరుని శకం ముగిసింది..
ఎంతో మంది బలహీనవర్గాల యువతకు మార్గనిర్దేశం చేశాడు..

(జ:ఆగష్టు18,1650-1708)

సేకరణ : ఫేస్ బుక్ (Gouthu Latchanna and Sarvai Papanna yuvasena)


బొల్లా శివయ్య గారు, జననం : 09 ఆగస్టు 1939, శివైక్యం : 02-10-2023

పుట్టిన ప్రతి ఒక్కరూ  మరణించక తప్పదు కానీ బ్రతికిన నాలుగు రోజులు ఎలా బ్రతికారు అన్నది గొప్ప ..... 

 జీవితం అంతా తన గౌడ సంఘీయుల ప్రగతికి, అభివృద్దికి నిరంతరం పరితపించిన వ్యక్తి  బొల్లా శివయ్య  గారు  ....

1939 ఆగష్టు 09 తేదీ బొల్ల అమ్మన్న, పాపమ్మ పుణ్యదంపతులకు కృష్ణ జిల్లా లోని వారి స్వగ్రామం అయిన పెడన గ్రామం లో జన్మించారు చిన్నతనం నుంచి చదువులో చురుకుతనముతో ఉంటూ మొదటగా జగ్గయపేట పంచాయతీ కార్యాలయంలో తర్వాత నల్గొండ పౌర సంబందాల శాఖలో చిరుఉద్యోగము చేస్తూ appsc ద్వారా హైదరాబాద్ సచివాలయములో ప్రభుత్వ ఉద్యోగము పొంది పలువిబాగములలో విదులు సమర్ధవంతముగా నిర్వర్తించారు టి‌డి‌పి ప్రభుత్వములో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.ఎన్.టి. రామారావు గారి కార్యాలయములో ఒక విబాగములో సెక్షన్ ఆఫీసర్ గా మరియు మంత్రిగా ఉన్న శ్రీ అంకేం ప్రబాకరరావు గారి దగ్గర ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా చేస్తూ 1997 జూలై 31 పదవి విరమణ పొందారు . పదవి విరమణ జరిగిన తర్వాత కూడా ఎల్‌బి స్టేడియం కార్యనిర్వహణ ఆదికారిగా 3 సం పనిచేశారు . ఉద్యోగము చేస్తూనే గౌడ కులమునకు అనేక సేవలు అందిచారు ప్రదానముగా 1973 లో గౌడ అఫిసియల్ అండ్ ప్రొఫెషనల్స్ సమాఖ్య స్థాపకులలో ఒకరు ,1983 AP గౌడ సంగం జాయింట్ సెక్రెటరీ ఉమ్మడి AP లో వివిద ప్రాంతాలలో తిరిగి గౌడ జాతి ఉన్నతికి బాటలు వేశారు . మరియు  ప్రదానముగా ఎవరి కులములో లేని విదముగా గౌడ ఉద్యోగస్తులను అందరినీ కలుపుతూ 1992 లో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం యేర్పాటు  చేసి అనేక విదములుగా గౌడుల అభివృద్దికి పునాదులు వేశారు .... అలాగే ప్రముఖ జనాదరణ కలిగిన మన గౌడ కుల పత్రిక గౌడ ప్రభకు 13 సం లు సబ్ ఎడిటర్ గా, గౌరవ సంపాదకునిగా, శ్రీ శైలం గౌడ సత్రము కార్యవర్గ సభ్యునిగా, ప్రదాన కార్యదర్శిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి, వెలకట్టలేనివి. అలాగే ఘన కీర్తి కావించిన గౌడుల చరిత్ర గ్రంధము రచనలో కూడా ఆయన సహకారము చాలా గొప్పది ....... 

గౌడ జాతి చరిత్రలో  ఆయన జీవన ప్రయాణము సువర్ణాఖరాలతో లిఖింజబడుతుంది.  ఆయన ఆశయ సాధనలో మనం అందరం కలిసి నడవాలని కోరుకుంటూ 

శ్రీ బొల్లా శివయ్యగారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము. 

 

సూరగాని రవిశంకర్, స్టేట్ ప్రెసిడెంట్, ఎపిగేవా

 


Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com