సంఘ స్థాపన :- గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘ స్థాపన కంటే ముందుగా హైదరాబాద్ కేంద్రంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) నిర్వహించబడుచుండేది. దీనిలో ఉద్యోగులే కాకుండా వివిధ వృత్తుల్లో ఉన్నవారు, వ్యాపారులు, రాజకీయ నాయకులు మరియు ప్రముఖంగా న్యాయవాదులు ఉండి తెలంగాణా ప్రాంతానికి ప్రత్యేకంగా హైదరాబాదుకు పరిమితమై నిర్వహించుచుండేవారు. దీనిలో మన సంఘ వ్యవస్థాపకులు శ్రీ బొల్లా శివయ్య గారు కూడా ఉన్నారు. ఈ సంఘ కార్యక్రమాలు ఉద్యోగుల ప్రయోజనాలకు, క్రమశిక్షణకు, కొన్ని కాండక్ట్ రూల్స్ కి విరుద్ధముగా ఉండుటవలన ప్రత్యేకముగా రాష్ట్రములో గౌడ ఉద్యోగుల సంఘాన్ని స్థాపించాలనే ఆలోచనకు వచ్చారు.
రాష్ట్ర సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా, శ్రీశైలంలోని గౌడసత్రంకు కార్యదర్శిగా ఉండి గౌడ సంఘీయులకు మరియు గౌడ ఉద్యోగులకు అనేక సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్న శ్రీ బొల్లా శివయ్య గౌడ్ గారు రాష్ట్రంలోని ఉద్యోగ ప్రముఖులందరినీ సంప్రదించి, తేదీ . 13,14 జూన్ 1992లో శ్రీశైలంలోని గౌడ సత్రంలో రాష్ట్ర గౌడ ఉద్యోగుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుండి 300కి పైగా ఉద్యోగులు హాజరయ్యారు. వీరందరికీ భోజనవసతి సౌకర్యాలు గౌడసత్రంతోపాటుగా కమ్మ, రెడ్డి, పద్మశాలి మరియు దేవస్థాన సత్రాలలో ఏర్పాటు చేయబడినది. రెండురోజులపాటు సుధీర్ఘముగా చర్చలు జరిగిన సభకు ప్రముఖముగా శ్రీ బొల్లా శివయ్య గౌడ్ గారు, వ్యవస్థాపకులు, శ్రీ వీరంకి నాగేశ్వరరావుగారు, శ్రీ జోగి నాగేశ్వరరావు గారు, శ్రీ మిద్దె సత్యనారాయణ, ఎం. దయానంద్ గౌడ్, మరీదు కోటేశ్వరరావు, కట్టా చంద్రశేఖర్, వీరమల్లు ఏడుకొండలు, ఉప్పల హరనాధ్ బాబు, తాతా కోటేశ్వరరావు, రేలంగి వెంకట్రావు, బడుగు ప్రసాద్, అట్ల పురుషోత్తం, ఎం. దామోదరం, కదిరి పుల్లారావు, జన్ను గౌతం మహాముని, సుంకర పుల్లయ్య, పడమట ఉమామహేశ్వరరావు, సురగాని వెంకటయ్య గౌడ్, నల్లమాస వెంకయ్య, మరీదు వెంకటేశ్వరరావు, గుణగంటి వెంకులు గౌడ్ మరియు న్యూఢిల్లీ నుండి శ్రీ పి.వి.రావు తదితరులు హాజరై సంఘ స్థాపనకు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సభలో తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల నుండి ఉద్యోగ సోదరులు హాజరైనారు.
తదుపరి బైలాస్ ను రూపొందించి ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘంగా నామకరణం చేసి రిజిస్టరు చేయడము జరిగింది. శ్రీ ఎరుకలన్న గౌడ్ కన్వీనర్ గా, శ్రీ అంకెం రాజారామ్మోహన్ రాయ్ కో*కన్వీనర్ గా, శ్రీ బొల్లా శివయ్య గౌడ్ ప్రధానకార్యదర్శిగా, శ్రీ వీరంకి నాగేశ్వరరావు, శ్రీ మిద్దె సత్యనారాయణలు కార్యదర్శులుగా మరికొంతమంది కమిటీ సభ్యులుగా తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
సంఘ అధ్యక్షులు :- 1992 లో స్థాపించబడిన సంఘానికి ఈ క్రింది వారు అడహక్ కమిటీ సభ్యులుగా నిర్ణయించుకోవడమైనది. అధ్యక్షులు శ్రీ పి. ఎరుకలన్న, ఇ.ఇ., ఉపాధ్యక్షులు : శ్రీ అంకెం రాజారామ్మోహన్ రాయ్, ఆర్.టి.ఓ, ప్రధాన కార్యదర్శి : శ్రీ బొల్లా శివయ్య గౌడ్, కార్యదర్శులు : శ్రీ వీరంకి నాగేశ్వరరావు, శ్రీ మిద్దె సత్యనారాయణ, ట్రెజరర్ : శ్రీ మానిపాడి దయానంద్ గౌడ్, కార్యవర్గసభ్యులుగా సర్వశ్రీ పడమట ఉమామహేశ్వరరావు, జోగి నాగేశ్వరరావు, ఉప్పల హరినాధబాబు, సుంకర పుల్లయ్య గౌడ్, సురగని వెంకటయ్య గౌడ్, నల్లపూస వెంకయ్య, రేలంగి వెంకట్రావు, కట్టా చంద్రశేఖర్ గౌడ్, మరీదు కోటేశ్వరరావు, మరీదు వేంకటేశ్వరరావు, గుణగంటి వెంకులు గౌడ్ గార్లు. ఏ.పి. గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం తేదీ. 28-08-1992 లో హైదారాబాద్ లో రిజిస్టర్ కాబడినది. రి.నెం. 2923/92.
1993 సంవత్సరంలో సంఘ ప్రధమ సర్వసభ్య సమావేశములో క్రింది వారు పాలక వర్గముగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులు :- శ్రీ మేడిశెట్టి అప్పారావు, జె.డి.(అగ్రికల్చరర్), అధ్యక్షులు : శ్రీ అంకెం రాజారామ్మోహన్ రాయ్, ఆర్.టి.ఓ, ప్రధాన కార్యదర్శి : శ్రీ బొల్లా శివయ్య గౌడ్, కార్యదర్శి : శ్రీ వీరంకి నాగేశ్వరరావు, ట్రెజరర్ : పలగాని గాంధీ, ఉపాధ్యక్షులు : శ్రీ మిద్దె సత్యనారాయణ, శ్రీ జి. వెంకటేష్, శ్రీ రేలంగి వెంకట్రావు , శ్రీ లుక్కా వెంకట సుబ్బారావు, శ్రీ జి. సుబ్రహ్మణ్యం, శ్రీ పలగాని నాగేంద్ర౦, శ్రీ బొర్రా సత్యనారాయణ, శ్రీ గద్దడ నరసింహారావు, శ్రీ గుణగంటి వెంకులు గౌడ్, శ్రీ తాతా కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు : శ్రీ జోగి నాగేశ్వరరావు, శ్రీ పరసా నాగరాజు, శ్రీ ఏ.పురుషోత్తం, శ్రీ ఎస్.పుల్లయ్య గౌడ్, శ్రీ ఎస్. ఆంజనేయులు, శ్రీ కీర్తి శాయన్న, శ్రీ పడమట మాణిక్యలరావు, శ్రీ టి. రాములు, శ్రీ మానిపాడి దయానంద్ గౌడ్, శ్రీ మంద జగన్నాధం.
ఆ తర్వాత, తేదీ. 28-08-1994న 94-96 సంవత్సరమునకు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. గౌరవ అధ్యక్షులు డా. దొమ్మేటి వెంకట నంద కుమార్ గౌడ్, అధ్యక్షులు: శ్రీ పారింకాయల కనకదుర్గాప్రసాద్, ప్రిన్సిపాల్, ప్రధాన కార్యదర్శి : శ్రీ వీరంకి నాగేశ్వరరావు, డిప్యూటీ రిజిస్ట్రారు, కార్యదర్శి: శ్రీ జోగి నాగేశ్వరరావు, రైల్వేస్, కోశాధికారి : ఎం.ఎస్.ఆర్.కె.ప్రసాద్, ఏ.ఇ., ఉపాధ్యక్షులు : శ్రీ బొల్లా శివయ్య గౌడ్, శ్రీ బొర్రా సత్యనారాయణ, బడుగు ప్రసాద్, డాక్టర్ శొంఠి వెంకటేశ్వరరావు, పరస నాగరాజు, డాక్టర్ బెల్లంకొండ మస్తాన్, కేశన నాగేశ్వరరావు, తాతా కోటయ్య, పలగాని గాంధీ, డాక్టర్ ఇ. సత్యనారాయణ, సుంకరి ఇస్తారి గౌడ్, మరీదు వెంకటేశ్వరావు, వేములకొండ వెంకటేశ్వరరావు, మరియు సంయుక్త కార్యదర్శులుగా : పడమటి బాబూరావు, కసగాని గోపాలరావు, బుర్రే సత్యనారాయణ, పడమటి ఉమామహేశ్వరరావు, కట్టా చంద్రశేఖర్ గౌడ్, ఉప్పల హరినాధ్ బాబు, కీర్తి శాయన్న, దద్దోలు రమణయ్య, ఎరకుల వేంకటేశ్వర రావు, శ్రీమతి వీరంకి లేపాక్షి, వీరితోపాటుగా గద్దెడ నరసింహారావు, బొడిగ చంద్రయ్య గౌడ్, బాలిన సత్యనారాయణ మొదలైన వారు ఉన్నారు.
ఈ కార్యవర్గం తరువాత శ్రీ శ్యామల ఈశ్వరయ్య గౌడ్ అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. శ్రీ వీరంకి ఆంజనేయులు గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా బాలిన సత్యనారాయణ, దద్దోలు రమణయ్య, కార్యదర్శులుగా నాశిన భాస్కర్ గౌడ్, చిట్టిబొమ్మ పనకలరావు, ఎం.దయానంద్ గౌడ్, జోగినాగేశ్వరరావు మొదలైన వారు పనిచేశారు.
తర్వాత తేదీ 27-07-2003న కొత్త కార్యవర్గం శ్రీ జోగి నాగేశ్వరరావు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ బుర్రే సత్యనారాయణ, దద్దోలు రమణయ్య, మనిపాడి దయానంద్ గౌడ్, కోశాధికారిగా శ్రీ చిట్టిబొమ్మ పానకాలరావు ఎన్నికైనారు.
తేదీ. 14-08-2015న మరొకమారు నూతన కార్యవర్గం ఏర్పడింది. గౌరవాధ్యక్షులుగా శ్రీ బొల్లా శివయ్య గౌడ్, శ్రీ వీరంకి నాగేశ్వరరావు, అధ్యక్షులుగా శ్రీ జోగి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శులుగా శ్రీ బుర్రే సత్యనారాయణ, శ్రీ దద్దోలు రమణయ్య గౌడ్, శ్రీ మానిపాడి దయానంద్ గౌడ్, కోశాధికారిగా శ్రీ పరసా సోమేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా శ్రీ అంకెం మోహనకృష్ణ, పరసా అజయ్ శివప్రసాద్, వి.వి. హరనాధ్, బత్తిన సాయిబాబా, కార్యదర్శులుగా 15 మంది, సభ్యులుగా 8 మంది ఎన్నుకోబడ్డారు.
2007-2009 సంవత్సరంకు కూడా ఇదే కార్యవర్గం కొద్ది మార్పులతో ఎన్నికైనది. 15వ వార్షికోత్సవం సందర్భముగా ఈ సంఘం కార్యక్రమములో త్రిమూర్తులకు సన్మానం జరిగింది. శ్రీ బొల్లా శివయ్య గౌడ్, శ్రీ వీరంకి నాగేశ్వరరావు గౌడ్, శ్రీ జోగి నాగేశ్వరరావు గౌడ్ గార్లను ఘనంగా సన్మానించారు. గేవాకు ఈ ముగ్గురు త్రిమూర్తులుగా అభివర్ణించారు.
2012 వరకు శ్రీ జోగి నాగేశ్వరరావు గారు అధ్యక్షులుగా పనిచేశారు. ఈ సుధీర్ఘ 25 సంవత్సరాలలో ఎక్కువకాలం పనిచేసిన అధ్యక్షులుగా శ్రీ జోగి నాగేశ్వరరావుగారు మాత్రమే
1992 సంవత్సరం నుండి శ్రీ బొల్లా శివయ్య గౌడ్ గాని, శ్రీ వీరంకి నాగేశ్వరావుగారు, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి ఆ తర్వాత గౌరవాధ్యక్షులుగా ఇప్పటివరకు అనగా 25 సంవత్సరములు సంఘం ఎట్టి ఒడిదుడుకులు లేకుండా "గోపా" నుండి ఎన్ని అవరోధాలు వచ్చినా తట్టుకుని అన్నీ జిల్లాలలోనూ శాఖలను నడిపించుకుంటూ వచ్చిన ఘనత శ్రీ బొల్లా శివయ్యగారు, శ్రీ వీరంకి నాగేశ్వరరావు మరియు జోగి నాగేశ్వరరావు గార్లకే దక్కింది. ఈ ఘనత. అందుకే ఆ ముగ్గురినీ సంఘ (గేవా) త్రిమూర్తులుగా పేర్కొనడం జరిగింది.
2013 సంవత్సరంలో కృష్ణా జిల్లాలో జరిగిన 22వ వార్షికోత్సవ రాష్ట్రస్థాయి మైత్రి సమ్మేళనంలో శ్రీ పరసా అజయ్ శివప్రసాద్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కాబడి అనేక సంస్కరణలు చేపట్టినారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా శాఖ "గౌడ ఉద్యోగుల కరదీపిక" అను డైరీని ముద్రించి కృష్ణా జిల్లాలో ఆవిష్కరించారు. ఈ కరదీపికను అన్నీ జిల్లాలకు అందించి అన్నీ జిల్లాలోని గౌడ ఉద్యోగుల జాబితాను తయారు చేయాలని సూచనలు ఇచ్చినారు. పదవిలో ఉండగానే వారు అకాలమరణం చెందినారు. అజయ్ శివ ప్రసాద్ గారి మృతి గేవాకు తీరని లోటు.
తేదీ. 14-06-2015న ప్రకాశం జిల్లాలో జరిగిన 23వ వార్షికోత్సవంలో శ్రీ పౌంజుల నాగేంద్రప్రసాద్ గారిని అధ్యక్షులుగా, శ్రీ చింతా రాజేశ్వర రావుగారిని ప్రధాన కార్యదర్శిగా, శ్రీ చింతా రామచంద్రరావుగారిని అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా, శ్రీ దద్దోలు రమణయ్య గౌడ్, శ్రీ జల్లెడ మనోహర, శ్రీ సి.హెచ్. హైమరావుగార్లను అసోసియేట్ అధ్యక్షులుగా, శ్రీ జి. రవిరవీంద్రనాధ్ గారిని కోశాధికారిగా ఎన్నుకోవడమైనది. మహిళా విభాగములో శ్రీమతి చెన్ను విజయలక్ష్మి గారు విశేషకృషి చేస్తున్నారు.
చివరగా వార్షికోత్సవం తేదీ 10-07-2016న విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం లోని ప్రతి జిల్లాలోను రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఇది అపూర్వమైన విషయముగా భావించవచ్చు. తేదీ 13-06-1992న శ్రీశైలంలో ప్రారంభించబడిన గౌడ ఉద్యోగుల మైత్రీ మహానాడు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘంగా ఆవిర్భవించి 25 సంవత్సరాలు నిరాటంకముగా నడుపబడటం గౌడజాతి చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా భావించవచ్చు. ఇందుకు మూలకారకులైన సర్వశ్రీ బొల్లా శివయ్య గౌడ్, శ్రీ వీరంకి నాగేశ్వరారావు, శ్రీ జోగి నాగేశ్వరరావు గౌడ్ గార్లకు గౌడ ఉద్యోగుల జాతి రుణపడిఉంటుంది.
24వ వార్షికోత్సవంలో కూడా పై కార్యవర్గాన్ని కొనసాగించడం జరిగింది. శ్రీ పౌంజుల నాగేంద్రప్రసాద్ గారు ఒక ఉన్నత పదవిలో కొనసాగుతూ, గౌడ జాతి ఉద్యోగుల మీద ఉన్న అభిమానంతో ఇంతకాలము అద్యక్షులుగా ఉంటూ రాష్ట్ర గేవా అభ్యున్నతికి నిరంతరమూ కృషి చేయడం అభినందించదగ్గ విషయం. ఆ తరువాత 27వ వార్షికోత్సవములో శ్రీ సూరగాని రవిశంకర్ గారిని ఎపిగేవా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.
శ్రీ సూరగాని రవిశంకర్, ఎపిగేవా, రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుండి సంస్థలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు జరిగాయి. కరోనా విపత్కర సమయంలో కూడా సేవాకార్యక్రమాల ద్వారా గౌడ సంఘీయుల అభిమానాన్ని చూరగొన్నారు.పరోక్ష విధానంలో రాష్ట్రస్థాయి సమీక్షలను ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని వాటిని అమలు చేయడం కోసం శాయశక్తులా కృషి చేసి గేవా కుటుంబ సభ్యులకు చేరువయ్యారు. అనుకూలురైన రాష్ట్ర కార్యవర్గం సహాయ సహకారాలతో రాష్ట్ర అధ్యక్షునిగా గౌడ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు కృషిచేస్తూ సంఘం అసోసియేషన్ రిజిస్ట్రేషన్ మరియు సంఘపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికై కృషిచేస్తున్నారు. స్వాభావికంగా శాంతమూర్తి మరియు దయార్ధ హృదయం కలిగిన శ్రీ సూరగాని రవిశంకర్ గారు లెక్కకు లేని సందర్భాలలో గౌడ సంఘీయులకు ఆర్ధికంగా సహాయం చేసి ఆపన్న హస్తం అందించారు. గతంలో ఏలూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి విజయవంతంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన అనుభవంతో జిల్లా స్థాయి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో తనదైన ప్రత్యేక శైలిని అవలంబించి విజయవంతంగా కొత్తజిల్లాల కార్యవర్గాలను మరియు మండల కమిటీలను ఏర్పాటు చేశారు. గౌరవనీయులు శ్రీ E.V.నారాయణ గారి ఆధ్వర్యంలో గౌడ కుల విద్యార్ధుల కోసం రూపుదిద్దుకుంటున్న నాలెడ్జ్ హబ్ నిర్మాణానికి తనవంతుగా రూ. లక్ష విరాళమివ్వడమే కాకుండా గౌడ ఉద్యోగుల అభివృద్ది సంఘము తరపున గౌడ ఉద్యోగుల ద్వారా విరాళములను సేకరించి నాలెడ్జ్ హబ్ నందు ఎపిగేవా పేరిట గదుల నిర్మాణము కొరకు ఉద్యోగులందరినీ అభ్యర్ధించి వారి ద్వారా నిర్మాణానికి అవసరమైన మొత్తాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గేవా ద్వారా అర్హులైన మెరిట్ విద్యార్ధులకు స్కాలర్ షిప్ ద్వారా తగు ప్రోత్సాహకాలు అందించడానికి గౌడ ఉద్యోగులందరి సహాయ సహకారాలతో ఒక బృహత్ పథకాన్ని రూపొందించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్నికి దిశగా ప్రయత్నం చేయడానికి సంఘాన్ని నడిపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఉద్యోగులలో ఐకమత్యాన్ని పెంపొందించేందుకు కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ఎపిగేవా రాష్ట్ర అధికారిక వెబ్ సైట్ అయినటువంటి http://apgewa.org అభివృద్ధి మరియు నిర్వహణ కొరకు స్వార్జితాన్ని ధారపోసిన వ్యక్తి శ్రీ సూరగాని రవిశంకర్ గారికి హార్ధిక శుభాకాంక్షలు & ధన్యవాదాలు. శ్రీ సూరగాని రవిశంకర్ గారి నేతృత్వంలో ఎపిగేవా ప్రగతి పథంలో పయనిస్తూ గౌడ ఉద్యోగులకు అండగా ఉండగలదని ఆశిద్దాము.
Here is the team our of Unity of APGEWA, are very competent, energetic and very determined with futuristics goals about our Organisation.