పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు కానీ బ్రతికిన నాలుగు రోజులు ఎలా బ్రతికారు అన్నది గొప్ప .....
జీవితం అంతా తన గౌడ సంఘీయుల ప్రగతికి, అభివృద్దికి నిరంతరం పరితపించిన వ్యక్తి బొల్లా శివయ్య గారు ....
1939 ఆగష్టు 09 తేదీ బొల్లా అమ్మన్న, పాపమ్మ పుణ్యదంపతులకు కృష్ణ జిల్లా లోని వారి స్వగ్రామం అయిన పెడన గ్రామం లో జన్మించారు చిన్నతనం నుంచి చదువులో చురుకుతనముతో ఉంటూ మొదటగా జగ్గయపేట పంచాయతీ కార్యాలయంలో తర్వాత నల్గొండ పౌర సంబంధాల శాఖలో చిరుఉద్యోగము చేస్తూ APPSC ద్వారా హైదరాబాద్ సచివాలయములో ప్రభుత్వ ఉద్యోగము పొంది పలువిబాగములలో విధులు సమర్ధవంతముగా నిర్వర్తించారు టిడిపి ప్రభుత్వము హయాంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.ఎన్.టి. రామారావు గారి కార్యాలయములో ఒక విభాగములో సెక్షన్ ఆఫీసర్ గా మరియు మంత్రిగా ఉన్న శ్రీ అంకేం ప్రబాకరరావు గారి దగ్గర ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా చేస్తూ 1997 జూలై 31 పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎల్‌బి స్టేడియం కార్యనిర్వహణ ఆదికారిగా 3 సంవత్సరాలు పనిచేశారు . ఉద్యోగము చేస్తూనే గౌడ కులమునకు అనేక సేవలు అందించారు. ప్రధానముగా 1973 లో గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ సమాఖ్య స్థాపకులలో ఒకరు ,1983 AP గౌడ సంఘం జాయింట్ సెక్రెటరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో తిరిగి గౌడ జాతి ఉన్నతికి బాటలు వేశారు మరియు ప్రధానముగా ఎవరి కులములో లేని విధముగా గౌడ ఉద్యోగస్తులను అందరినీ కలుపుతూ 1992 లో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం యేర్పాటు చేసి అనేక విధములుగా గౌడుల అభివృద్దికి పునాదులు వేశారు .... అలాగే ప్రముఖ జనాదరణ కలిగిన మన గౌడ కుల పత్రిక గౌడ ప్రభకు 13 సం లు సబ్ ఎడిటర్ గా, గౌరవ సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంఘము ప్రధాన వ్యవస్థాపకులుగా, శ్రీ శైలం గౌడ సత్రము కార్యవర్గ సభ్యునిగా, ప్రదాన కార్యదర్శిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి, వెలకట్టలేనివి. అలాగే ఘన కీర్తి కావించిన గౌడుల చరిత్ర గ్రంధము రచనలో కూడా ఆయన సహకారము చాలా గొప్పది. గౌడ జాతి చరిత్రలో ఆయన జీవన ప్రయాణము సువర్ణాఖరాలతో లిఖింజబడుతుంది. ఆయన ఆశయ సాధనలో మనం అందరం కలిసి నడవాలని కోరుకుంటూ శ్రీ బొల్లా శివయ్యగారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము.
సూరగాని రవిశంకర్, స్టేట్ ప్రెసిడెంట్, ఎపిగేవా