గౌడ వంశమనగా గౌడ, గమళ్ళ, శ్రీశయన, కలాలీ, యాత, ఈడిగ, చుండ్ర, యాండ్రు, శెట్టిబలిజ మొదలగు కులముల సముదాయము. వీరి ముఖ్య వృత్తి తాటి, ఈత, పోక, కొబ్బరి, ఖర్జూరపు చెట్లనుండి కల్లు, నిరా ఉత్పత్తి చేయుట, బెల్లం, పంచదార వగైరా తయారు చేయుట, ఉప వృత్తులు వ్యవసాయము, పశుపోషణ,
అనాదిగా గౌడజాతీయులు శివపూజా దురంధరులు. స్వామిభక్తి పరాయుణులని ప్రతీతి. మెడలో రుద్రాక్షమాలలు, లింగకాయలను విధిగా ధరించేవారు. ముఖ్యంగా చెప్పాలంటే తన మెడలో లింగం,కత్తులపొదవికి లింగం, కల్లుబానకు లింగం, తునకలబండకు లింగం, నొసట విభూతి రేఖలు ధరించి మిక్కిలి నియమ నిష్టలతో సహజీవనము చేసేడివారు.