News And Events

News And Events


🌹అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుజితగౌడ్ గారికి ఘన సన్మానం 🌹
 

గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు గిద్దలూరు గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలోని స్థానిక సాయిబాబా దేవస్థానం నందు ఇల్లూరి సుజిత గౌడ్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగినది ఈ సన్మాన కార్యక్రమానికి గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మింగి నాగేశ్వరరావు గారు అధ్యక్షత వహించడం జరిగినది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మార్కాపురం జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొమర వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఇల్లూరి సుజిత గౌడ్ గారు ఎంతో కష్టపడి విజయం సాధించారన్నారు. మీరు తప్పకుండా భవిష్యత్తులో మన గౌడ సంఘీయుల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్ గారు మాట్లాడుతూ నూతన మార్కాపురం జిల్లాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్-1 పోస్ట్ సాధించిన మొట్టమొదటి గౌడ బిడ్డ ఇల్లూరి సుజిత గౌడ్ గారిని అభినందించారు. వీరు గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడంలో ఎదురైన అనుభవాలను గౌడ సంఘీయులందరికీ తెలియజేయాలని సూచించారు, గౌడ సంఘం పెద్దలు డాక్టర్ జెవి నారాయణ గౌడ్, గౌడ సంఘం మరియు బీసీ సంఘాల ప్రముఖ నాయకులు కంచర్ల కోటయ్య గౌడ్ గారు, గజ్జ నాగరాజు గౌడ్ గారు గిద్దలూరు గౌడ సంఘం అధ్యక్షులు గజ్జ రంగనాయకులు గౌడ్ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, ఇల్లూరిసుజిత గౌడ్ గారి తండ్రి ఇల్లూరి వెంకటేశ్వర్లు గారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా కూతురు విజయం సాధించడంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నదని, ఈ కెరీర్ ని ఎంచుకోవడంలో ఏమైనా పొరపాటు చేశామా అని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని భావోద్వేగానికి లోనయ్యారు. చివరికి మా కూతురు గ్రూప్ వన్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ ఉద్యోగం సాధించినందుకు చాలా గర్వకారణంగా ఉందని ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఇల్లూరి సుజిత గౌడ్ గారు మాట్లాడుతూ నా విజయంలో మా తల్లిదండ్రుల పాత్ర ప్రముఖ స్థానం అని అలాగే మా భర్త గారి సహకారం మరువలేనిదని తెలియజేశారు. ఎవరైనా ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు దాని మీదే దృష్టి ఉంచాలని, కష్టపడి  ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధిస్తారని తెలియజేశారు. భవిష్యత్తులో గౌడ సంఘీయుల అభివృద్ధి కొరకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కంచర్ల స్వామి గుండమయ్య, కంచర్ల రంగవరప్రసాద్ గౌడ్, మింగి ప్రసాద్ గౌడ్, కంచర్ల నాగరాజుగౌడ్, గజ్జ విటల్ ,గోరా బాల రంగయ్య గౌడ్, చిలకా వెంకటేశ్వర్లు గౌడ్, చిలకా వెంకటసుబ్బయ్య గౌడ్, గజ్జ తిరుపతయ్య గౌడ్ , ఇల్లూరి రమేష్ గౌడ్ , గాడ్దుల రాజశేఖర్ గౌడ్ గజ్జ పాండు ,కంచర్ల శ్రావణ్ గౌడ్, కంచర్ల శ్యాం ప్రసాద్ గౌడ్, LIC డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఇల్లూరి రమేష్ గౌడ్, కంచర్ల మానస, గజ్జ దుర్గాదేవి, గజ్జ లక్ష్మీదేవి, ఇల్లూరి వెంకటేశ్వర్లు గౌడ్ మరియు వారి సతీమణి, మరియు  అధిక సంఖ్యలో గౌడ సంఘీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి శ్రీ సాయిబాబా దేవస్థానం మందిరాన్ని ఉచితంగా ఇచ్చినందుకు డాక్టర్ జెవి నారాయణ గారికి గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు గిద్దలూరు గౌడ సంఘం తరఫున  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయుచున్నాము.

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com