ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రం నివాసి అయిన గడ్డమీది సుబ్బారావు గౌడ్ షుగర్ వ్యాధి అధికమవడం వలన ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటూ విధి లేని పరిస్థితుల్లో అతని కాలును మోకాలి పై భాగం వరకు ఆపరేషన్ చేసి తొలగించవలెను అని డాక్టర్ గారు తెలపడంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం ప్రొద్దుటూరు ఈడిగ సంఘం ప్రతినిధులు తెలపడం జరిగింది. ఈ విషయంపై గౌడన్నకు చేయూత చైర్మన్ మన్నెం రామ్మోహన్ గౌడ్ తక్షణమే స్పందించి చేయూత సభ్యులతో చర్చించి అతనికి వైద్య చికిత్స కొరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడంతో... పులివెందుల ఈడిగ సంఘం అధ్యక్షులు కంపరాజు కొండయ్య గౌడ్ గారు తనవంతుగా అతనికి ₹. 4000/- రూపాయలు అందించటంతో మొత్తంగా గౌడన్న కు చేయూత ద్వారా సభ్యులతో ఇవాళ ప్రొద్దుటూరు ఆసుపత్రికి వెళ్లి స్వయంగా పరామర్శించి సుబ్బారావు గౌడ్ కు ₹. 25000/- రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్నెం రామమోహన్ గౌడ్, కంప రాజు కొండయ్య గౌడ్,వీరబల్లి భువన్ గౌడ్, గేవా ప్రెసిడెంట్ మలిశెట్టి ప్రసాద్ గౌడ్,బత్తుల మాచర్ల గౌడ్, దొంతా సురేష్ గౌడ్, దొంతా రామయ్య గౌడ్, పొన్నాల రామకృష్ణ గౌడ్, గడ్డమీది వెంకట రమణ గౌడ్, కంప రాజు నరసింహులు గౌడ్, మన్నెం యశ్వంత్ గౌడ్, కంప రాజు చిన్న నరసింహులు గౌడ్, మన్నెం దేవి, ఆది లక్ష్మమ్మ గౌడ్, వెంకట లక్ష్మమ్మ గౌడ్ ,పుల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.