News And Events

News And Events


మహా దేవుడి మహత్యాన్ని వేడుకగా జరుపుకునే పవిత్రమైన రోజే మహా శివరాత్ర ి. దీనినే 'శివరాత్రి' అని ప్రముఖంగా పిలుస్తారు. ఇదే రోజున పార్ వతీపరమేశ్వరుల వివాహం జరిగిన రోజుగా కూడా చెప్తారు. శివం మరియు శక్తి ఏమై న రోజును ఇది సూచిస్తుంది. శివం అంటే ఆది- అంతం లేని- సమస్తం అనే అర్థం వ స్తుంది.

చాంద్రమాన నెల లెక్క ప్రకారం, గ్రెగేరియన్ క్యాలెండర్లో శివరాత్రి ఫిబ ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మా సము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. సంవత్సరంలో వచ్చే పన్నెండ ు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. శివర ాత్రి ప్రత్యేకంగా హిందువులకు విశిష్టమైన పండుగ. శివుడు (Lord Shiva) ఈరో జే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ఈరోజున ఆ ఆది దేవుడు పర మ శివుడిని భక్తి , శ్రద్ధలతో కొలుస్తూ జరుపుకుంటారు. ఆ భోలా శంకరుడి అను గ్రహం కోరుతూ తెల్లవారుజామునే లేచి, తల స్నానం చేసి, పూజలు చేసి, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. ఆ మరునాడు ఉపవాసం విడుస్తారు.

శైవక్షేత్రాలలో శివరాత్రి అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. ఓం నమ: శివా య, హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలో శివరాత్రి జరుగుతుంది.శివు డు అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (తమో, రజో, సత్వ) గుణాలేవ ీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం సకలజనులని పరిశుద్ధం చేస్తుందని పురా ణాలు చెబుతాయి.

ఈ శివరాత్రి రోజున మీకు పరమశివుని కరుణాకటాక్షాలు కలగాలనే ఆకాంక్షతో & nbsp;మహా శివరాత్రి శుభాకాంక్షలతో అందజేస్తున్నాం

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com